Saturday, February 16, 2013

ఏ ఊతం లేని నా జీవితంలో


 ఏ ఊతం లేని నా జీవితంలో,  
 జీతం  బత్తెం కొరతైన రోజుల్లో, 
 తెగిన పతంగమై, తీరు తెన్నూలేక,  
  బరితెగించిన దున్నపోతులా, 
అచ్చోసిన ఆంబోతులా, 
 బస్తి అంతా గస్తీ తిరిగే రోజుల్లో,
 ఓ  ఇంతి, ముద్దులొలికే ముద్దబంతి, 
 అరుదెంచి నాలో నిక్షిప్తమైన నిద్రాణమైన ప్రతిభను గురుతెరింగి 
 మాటా మంతీ కలిపి, ఆప్యాయత కలబోసి, 
  తీయటి పల్కుల  విద్యుల్లతలను నాపై  (తనువంతా)  ప్రసరింపచేస్తూ , 
 ఉమ్మెత్త పువ్వుకి తావి ని అతికించి 
  చితికిన డెందము ను మరమ్మతు చేసి, 
  నాకు జీవితేచ్ఛ కలిగించి దిగంతాలకు పోయిన 
  ఆ అమృతమూర్తి కిదే నా ఆవేదనతో కూడిన నివేదన 

No comments:

Post a Comment