Monday, January 21, 2013

నీ కవిత్వం అర్థంకాని తురకం


నీ కవిత్వం అర్థంకాని తురకం

తెలుగు కవిత్వానికి అది ఒక మరకం

అది విన్నవాడికి పుడుతుంది కడుపులో వికారం

చివరకు చేరతాడు వాడు నరకం

Friday, January 18, 2013

యుగాంతం



యుగాంతం ముందు గుణింతాలు చెప్పమని కుప్పిగంతులు వేస్తున్న ఓ ఇంతీ

చామంతి పూబంతి కాదు...

చూడు చూడు బయట చూడు తిరుగుతున్న తలనిచూడు

చూరు లేని పేదవాడు తిండి లేని బక్కవాడు

వాడ వాడ వున్న పీడ, కనపడలేదా నీకు నీ నీడ


ధమరుకం లో వత్తు తీసి అయ్యే ఒక మర్కటం

టం ట టం టం తొం తక ధిమి తొం

అక్షరాలకి వత్తులేందుకు గమ్మత్తుగా!!

దిగనంత వరకు తాగు మత్తు మత్తుగా

వుందిగా ప్రక్కన బెల్టు షాపు గుత్తంగా, ఇది ప్రభుత్వం చిత్తం గా !

అక్షరానికి వత్తులు తీసెయ్యి, నల్లాలకి మూతలు వేసేయ్యి

క్షణం క్షణం తీక్షణం నిరీక్షణం పరీక్షణం సమర్పణం

Thursday, January 17, 2013

క్రీం






పిల్లి తోలు తీసి ప్రతి రోజు వుతికినా
తీపి పులుపు కాదు తెలుపు నలుపు కాదు
నలుపు నల్లగా వుండదు తెలుపు తెల్లగా వుండదు
మెత్తటి గుండ్రాయితో నెత్తిన మోదిన రోజు
తెలుస్తుంది నలుపు తెలుపు ఒకటేనని వదిలాక తలలో బూజు
కలగా పులగం చేసి మా బుర్ర లో గుజ్జు తీసి
మసిపూసి మయసేసి గుండు గీసి గిరి గీసి
అలసి సొలసి తొలిచి తొలిచి మనసు కలచి
నేను నీ కలలో కనపడే బూచి విశూచి క్రీం
హిం ధాం ద్రుం బ్రిం కభం జగదం కచింబా....


ఓహ్ కనకం

ఓహ్ కనకం

నీవే నాకు ఇన్స్పిరేషన్

ఇక లేదు నా కవితా ఝరి కి రేషన్

వేసుకో నీ ఖతా లో ఓహ్ ప్రమోషన్

విన్నవారందరూ అవుతారు ఎమోషన్

కవితలోకానికి ఇది ఒక సెన్సెషన్

ఇక లేదు నా కవితా ప్రవాహానికి సెసేషన్

Wednesday, January 16, 2013

వచ్చింది వచ్చింది సంక్రాంతి

వచ్చింది వచ్చింది సంక్రాంతి
తెచ్చింది తెచ్చింది కోటి దీపాల కాంతి

ఇది రైతుల పండుగ
ఇది నూరిపిళ్ళ పండుగ
ఇది బావ మరదళ్ల పండుగ
ఇది బసవన్నల పండుగ
ఇది కోడి పందాల పండుగ
ఇది కొత్త అల్లుళ్ళ పండుగ

వచ్చింది వచ్చింది సంక్రాంతి
తెచ్చింది తెచ్చింది కోటి దీపాల కాంతి

ఇంటింట రంగవల్లులు

ఇంటింట రంగవల్లులు
ఉరూరా గంగిరెద్దులు
హరిదాసుల పాటలు
చిన్నపిల్లల ఆటలు

వచ్చింది వచ్చింది సంక్రాంతి

వచ్చింది వచ్చింది సంక్రాంతి
 తెచ్చింది తెచ్చింది కోటి దీపాల కాంతి
ఇది రైతుల పండుగ
పంటలతో గాదెలు నిండుగ
బసవన్నల అరుపులతో మెండుగా
వచ్చింది సంక్రాంతి కన్నుల పండువగా

Tuesday, January 15, 2013

భోగి పండగ రోజు

భోగి పండగ రోజు పాతవన్నీ తగలేసి
సంక్రాంతి కి కొత్త కొత్త ముగ్గులేసి
హరిదాసులకు దోసిళ్ళతో ధాన్యం పోసి
గంగిరెద్దుల ఆటలకి పిల్లలు డాన్సు చేసి
కొత్త అల్లుళ్ళు సరికొత్త పంచెలేసి
బావ సరసానికి మరదలి బుగ్గ సిగ్గులేసి
కనుమకి కోళ్ళతో పందేమేసి
బూరెలూ, పిండి వంటలు మేక్కేసి,
భార్య తో మంచ మెక్కేసే
సగటు జీవికి సంజీవని ఎందుకు దండగ
ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగ వుండగా

దీపావళి

భగ భగ ధగ ధగ లాడెను దీపావళి 
దడ దడ గడ బిడ ఉరికేను నా సిరా పాళి
నాసిరకపు సిరా కాదు కాదు, ఇది అయినది పదునైనది 
పసందైనది మీ గోడమీది పిడకైనది

వదలలేను నే నా సిరా, శ్రీ, కారం, సురేకారం కలిపి 

నే చేసిన ఆకారం నా కవితా ప్రకారం
కొట్టలేరు తట్టలేరు కదల లేరు వదల లేరు
నా మదిన మెదలిన భావం వదలాలనుకోడమే నా బలం, బలహీనత

గొంతున గుంపుగనున్న ఆ గంతులేమాయే

హరివిల్లున వంపుతగ్గినట్టు చోద్యమాయే
ఇది ఖచ్చితంగా ఆ శ్రీనివాసుడి మాయే
త్వరగా వూపిరితీయకపోతే నేను పాయే!

Sunday, January 13, 2013

వచ్చింది వచ్చింది సంక్రాంతి

వచ్చింది వచ్చింది సంక్రాంతి
తెచ్చింది తెచ్చింది కోటి దీపాల కాంతి
పెంపొందాలి పాడి పంటల విక్రాంతి
వేల్లివిరియాలి ప్రతి తెలుగింట సుఖ శాంతి

అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు

దేవరకొండ సుబ్రహ్మణ్య (దేసు)

సిరిసంపదలతో - సంక్రాంతి


         ప్రపంచం లోని తెలుగు మిత్రులందరూ,
  భోగ భాగ్యాలతో - భోగి 
  సిరిసంపదలతో - సంక్రాంతి 
  కన్నుల పండుగుగా - కనుమ
జరుపు కోవాలని కోరుకుంటూ

మీ  
-- నాగరాజు 

Saturday, January 12, 2013

ఓ ఐస్ క్రీమూ !

ఓ ఐస్ క్రీమూ ! నువ్వంటే నాకు చాలా లవ్వు

 తినడానికీ పరుగుపెదత రివ్వు రివ్వు

 తిన్నాక నా పళ్ళు ఇక జివ్వు జివ్వు

 అతిగా తిన్నాక నాకు పెరుగుతుంది ఒంట్లో కొవ్వు

 అది విన్న  మా ఆవిడా పెడుతుంది ఒక పెద్ద కేక కెవ్వు

 ఎందుకే  నన్నింత ఊరిస్తావు నువ్వు?

Friday, January 11, 2013

O Narahari

ఓ నరహరి
నువ్వుండేది యాదగిరి
ఓ నరహరి
నువ్వుండేది యాదగిరి

తెలంగాణా మీద ఏందీ కిరి కిరి
మా నేతల కొట్లాటలు సరే సరి

నువ్వే రావాలే ఈ పంచాయతి తీర్చ  మరి

ముందు మాట

ముందు మాట 

     నేను నా స్నేహితులు ప్రాస కోసం పాకులాడుతూ చేసే పిచ్చి ప్రయోగాలని కవిత అనాలో, లేక తవిక అనాలో తెలియక, ఉన్న రెండు వెంట్రుకలను పీక్కుంటూ ఉండగా... 
     మా గురువు గారు జంధ్యాల గారు గుర్తుకు వచ్చి... (నేను ఆయనకీ ఏకలవ్య శిష్యుడిని లెండి )...  వెంటనే నా బ్లాగ్ పేరు కవితవిక గా నిర్ణయించి, ఈ కితకితల మహాయజ్ఞానికి  శ్రీకారం చుట్టాను... 

     ఇందులో  మీ భాషా పరిజ్ఞానాన్ని పరీక్షించు కోవచ్చు... మీ చేతుల కున్న దురద తీర్చుకోవచ్చు , అలాగే, మీ శత్రువుల మీద పగ (భౌతికంగా కాదు లెండి) తీర్చుకోవచ్చు (మీ తవికలు వినిపించి, అంకితమిచ్చి) 

     సునిశిత  హాస్యాన్ని అందించే అందరి రచయితలకి ఇదే నా ఆహ్వానం 

భవదీయుడు 
-- నాగరాజు