Wednesday, February 3, 2016

మెరిసిపోతుంది నా గుండు ఏంటిలా ??

జుట్టురాలుతూ వయస్సు పెరుగుతున్న ఒక బ్రహ్మచారి పాడిన పేరడీ. మరణమృదంగం సినిమాలోని కరిగిపోతుంది కర్పూర వీణలా పాట కి పేరడి. సృష్టికర్తలకు క్షమాపణలు. పల్లవిలో బ్రహ్మచారి తన గుండు చూసుకొని మురిసిపోతుంటాడు. తన గుండు గురించి గొప్పగా అనుకుంటాడు. చరణం తనని ఆటపట్టిస్తున్న మిత్రుడి తిత్తి తీస్తూ సరదాగా సాగిపోతుంది. మెరిసిపోతుంది ఇది రెండు వైపులా పెరగనంటుంది నా గుండు ఏంటిలా?? నా జుట్టు ఊడిపోతున్నా తలపట్టుకోను అంటున్నా!! కనిపెట్టినాము కద సున్నా దిగులెందుకోయి అనుకున్నా బోడిగుండంటే అసలేంటి మాటలా...?? కోరుకున్నంతనే రాదు మీకలా..!! బ్రహ్మచారినని అలుసుగా వంటోచ్చా మరి సరిగా పెరుగుతుంది మరి వయసుగా..?? పిల్లను తే మరి త్వరగా..!! నీ వయసుకే అలుపోచ్చేగా నీ ముందు నే ఒక బచ్చగా ఈ గుండుతో వయసుండినా మరుగుండి పోయెలే ఎలోగా కరుణ చూపొద్దు నా గుండు పైనలా కొరికి చూడొద్దు ఒక తిండి పోతులా మెరిసిపోతుంది ఇది రెండు వైపులా పెరగనంటుంది నా గుండు ఏంటిలా?? నా జుట్టు ఊడిపోతున్నా తలపట్టుకోను అంటున్నా!! కనిపెట్టినాము కద సున్నా దిగులెందుకోయి అనుకున్నా బోడిగుండంటే అసలేంటి మాటలా...?? కోరుకున్నంతనే రాదు మీకలా..!! -కనక

Thursday, November 21, 2013

Money song ki Parody

చింద్రం నీ బ్రతుకే బ్రదరూ డబ్బును తెలివిగ వాడు గురు
ఇబ్బడి ముబ్బడి కోరికతో చత్తగ అవ్వకు నువ్విగురు 
బ్యాంకులొ దాచిన డబ్బులు చాలద ఇంట్లో సంగతి చూడోమారు
ఆలిని పిల్లని అల్లన తోసి సాదించేదేముంది గురూ
చింద్రం నీ బ్రతుకే బ్రదరూ డబ్బును తెలివిగ వాడు గురు
ఇబ్బడి ముబ్బడి కోరికతో చత్తగ అవ్వకు నువ్విగురు 

తిండికని వంటిల్లుండగ హోటలుకెలతారు 
నానా గడ్డికి డబ్బులు కట్టి మూలాన పడతారు  
బ్రాండుల కోసం బానిసలవుతూ నీరసపోతావు 
పక్కింటోడితొ పోటీ పడుతూ లేస్తూ వుంటావు  
చివరకి కరుసైపోతావు 

చింద్రం నీ బ్రతుకే బ్రదరూ డబ్బును తెలివిగ వాడు గురు
ఇబ్బడి ముబ్బడి కోరికతో చత్తగ అవ్వకు నువ్విగురు 

కారుకని బెంజెందుకురా హోండానే చాలు 
ఊరికనే పరుగెందుకురా గోరిగింది చాలు 
4s అయినా 5s అయినా మాటరు ఒకటేగా 
ఓ ఎస్సంటూ ముందుకుపోతే అంతా మంచెగా 
పెళ్ళాం పిల్లలు నీకేగా 
చింద్రం నీ బ్రతుకే బ్రదరూ డబ్బును తెలివిగ వాడు గురు
ఇబ్బడి ముబ్బడి కోరికతో చత్తగ అవ్వకు నువ్విగురు 


Tuesday, November 19, 2013

Telugu Chandassu - Kanda Padyam

తెలుగు గణాలు:
------------------
          ఇంద్ర గణాలు:  నల నగ సల భ ర త
                              నల  - I I I I 
                              నగ - I I I U 
                              సల - I I U I 
                              భ - U I I 
                              ర - U I U 
                              త - U U I 
         సూర్య గణాలు : గల  న 
                              గల - U I 
                              న  - I I I 

తెలుగు రీతులు :
-----------------
        ౧) కందం 
                        కంద  పద్యం  అందం  ఇంత  అంత  కాదు. అతి  సుందరమైన   పద్య  రీతులలో కందం  ఒకటి .  

              1. కంద  పద్యంలో  
                              "గగ"(UU), "భ" (U I I), "జ" (I U I), "స"(I I U), "నల" (I I I I)
                                             అనే  గణాలు  వస్తాయి  . గమనిస్తే  అన్ని  4 మాత్రలు  కల గణాలే!
               2. కందంలో  1,3 పాదాలలో  3 గణాలు, 2,4 పాదాలలో  5 గణాలు  వుంటాయి 
               3. బేసి  గణం  "జ" గణం  కారాదు.   
                             అంటే  1,3 పాదాలలో  1,3 గణాలు,  2,4 పాదాలలో  2,4 గణాలు "జ" గణం  కాకూడదు  
               4. 2,4 పాదాల అంతంలో  "గురువు" ఉండాలి .  అంటే  ఈ  పాదాలలో  5 వ  గణం  "గగ" లేదా  "స" అయి  ఉండాలి  
               5. ప్రాస  నియమం  పాటించాలి.  ప్రాసయతి  పనికి  రాదు 
               6. యతి  మైత్రి  2,4 పాదాలలో  మొదటి  అక్షరానికి , నాలుగో  గణం మొదటి  అక్షరంతో  కుదరాలి  
               7. అన్ని  పాదాలలో  మొదటి  అక్షరాలు  అన్ని  హ్రస్వాలు  గాని , అన్ని  దీర్ఘాలు గాని  అయి  ఉండాలి  
               8. 2,4 పాదాలలో  3 వ  గణం  "జ" కానీ  "నల" కానీ  అయి  ఉండాలి   

చూడటానికి  చాలా  # స్ట్రిక్ట్ # గ  అనిపించినా, కందంలోని  గణాలన్నీ  నాలుగు మాత్రల  గణాలు  కావటం  వలన  పద్యం  లయ  పట్టుకోవటం  కాల  తేలిక. 
ఒక  సారి  కంద  పద్యం  లయ   అలవడితే  పద్యాలూ  వాటంతట  అవే  ఈ  సూత్రాలకు అనుగుణంగానే  వస్తాయి. \
సుమతి  శతక  పద్యాలు  అన్ని  కంద  పద్యాలే. మీకు  వచ్చిన  పద్యాలనూ  నెమరు  వేస్తూ  లయ  బద్ధంగా  చదవటానికి   పైకి చదువుతూ  సాధన  చేస్తే  పద్యాలు  చదవటం , రాయటం , గుర్తుంచుకోవటం 
తేలిక  అవుతాయి ! 

Sunday, November 17, 2013

సమస్యా పూరణం

చరిత్ర సృష్టించ ఇంద్రుడు ఆంధ్రకు బోయెన్ 
గోడదూక ఈకలు పెంచే కొకలాగ ఆశించెన్ 
బుర్ర ఝల్లన బుడిపే లేచి తడిమి వెనుతిరగ బిత్తరన్   
అప్సరస మోముని జూచి ఇంద్రుడు మూర్చ బోయెన్ 

Sunday, November 10, 2013

Oka tamila pataki peradi

Saradaga mitrudu Bharadwaja meeda vesina visuru.


Pelli subhakamkshalu

Mitruni peli roju subhakankshalaki kanaka padda patlu.

మీ పెళ్లి రోజు e-జనాలకి భోజనాలు పెట్టకపోయినా ఖజానా కదలక మంచి బిస్కెట్టు వేసారు. మీ బిస్కట్టు మీద మనసెట్టక మీ పనిపట్టాలని రోడ్డున పడ్డాను. ఇది మీకోసం.

సాగితి త్రాగితి బొక్కెన స్టారు బుక్సు
మోసితి ఆ పడతి స్ట్రేంజ్ లుక్సు
మ్రోగించితి వాహనమున అరవ సాంగ్సు
పలకదాయే అంబ ఇవ్వదాయే ఆశిస్సు

కళ్యాణరామకి పెళ్లి రోజు శుభాసిస్సులు
చూద్దామన్నాకనపడవుగా మీమోమున కస్సు బుస్సులు
పెళ్ళంటే చెప్పడమే కదా ఎప్పుడూ ఎస్సులు
లేకపోయిన తప్పదు చివరికి తపస్సులు
ఎప్పుడూ ఉండండి హాట్ చాకోలేట్టులా
సరదాకోసం అప్పుడప్పుడు చీక్లేట్టులా

పట్టు విడవక జుట్టు ముడవక నడుము వంచాక
కలుక్కుమనె కీలు తళుక్కుమనే ఈ హుళక్కవితవిక
మీకోసం సరదాగా ఈ తవికల తలంటు
వూడగోట్టకండి ఈ ఫ్రెండు ఫిలమెంటు

Friday, November 8, 2013

Corporate Successful Stories...

ఒక శిల్పి రాజుగారి ఆస్థానంలో ఉద్యోగం సంపాదించేందుకు అడవి మార్గాన వెళ్ళసాగాడు . మద్యాహ్నము భోజన వేళ కావడంతో ఒక చెట్టు కింద ఆగి, భోజనం చేసి, విశ్రాంతి తీసుకొను చుండగా, అక్కడ నేల మీది పడివున్న రాళ్ళు కనిపించాయి. అవి చదరంగా, నున్నగా ఉండటంతో, ఆతని లోని కళాకారుడు మేల్కొని, వెంటనే మొదటి రాతిని మలచ సాగాడు. శిల్పి యొక్క ఉలి దెబ్బలు తట్టుకోలేక ఆ రాయి, అమ్మా అబ్బా అని అరవసాగింది. అది విన్న శిల్పి కొంచెం చిరాకు చెంది, మరల తన పని ప్రారంభించాడు. ఈ సారి, ఆ రాయి, ఇంకాస్త గట్టిగా అమ్మా అబ్బా అని అరవసాగింది. దాంతో చిరాకు వచ్చిన శిల్పి, ఈ రాయి కాదులే అని దానిని పక్కన పెట్టి, పక్కనే ఉన్న రాయిని తీసుకొని పని మొదలు పెట్టాడు.
ఈ రెండవ రాయి, తన పుట్టుక, కర్తవ్యం తెలిసినది కనుక, శిల్పి దెబ్బలు ఓర్చుకొని మౌనంగా ఉంది. ఒక గంటి సేపు పనిచేసిన తరువాత, ఆ శిల్పి తను చెక్కిన శిల్పం వైపు చూసి, తృప్తి చెంది, మంచి శిల్పం చెక్కానన్న ఆనందంతో మరల తన ప్రయాణం మొదలు పెట్టాడు.

ఆ తరవాత కొంత సేపటికి, ఆ త్రోవ లోనే వెళుతున్న కొంత మంది బాటసారులు, ఆ చెట్టు కింద సేద తీరుదామని, అక్కడ కూర్చున్నారు. ఇంతలో, ఒక బాటసారి, అక్కడ చెక్కి ఉన్న రాయిని చుసి, ఆహా, ఎవరో మహాశిల్పి ఇక్కడ చక్కని దేవుని విగ్రహం చెక్కాడు అని ఆనందంతో, చక్కగా ఉన్న ఆ శిల్పాన్ని, ఆ పక్కనే ఉంచి, దగ్గరలోనే ఉన్న చెరువు లో నుంచి నీళ్ళు తెచ్చి, శిల్పాన్ని కడిగి, చెట్టు పూలు ఆ శిల్పం కాళ్ళ దగ్గర ఉంచాడు. మరొకామె తన వద్ద నున్న పసుపు, కుంకుమ, ఆ శిల్పం మీద వేసి, పక్కనే ఉన్న మొదటి రాయిని, దేవుని విగ్రహం ముందుకు జరిపి, ఆ రాయి మీద కొబ్బరి కాయ కొట్టింది.

తరవాత కొద్ది రోజులకే, ఆ దేవుడి విగ్రహానికి పూజలు మొదలై, ఆ మొదటి రాయిని, శాశ్వతంగా, కొబ్బరి కాయలు కొట్టే దానికింద మార్చారు...

అప్పుడు మొదటి రాయి, ఆహా, ఒక గంట దెబ్బలకి ఓర్చుకుంటే, హాయిగా గుళ్ళో పూజలు అందుకునేదాన్ని, ఆ కష్టం పడలేక పోవడం వల్ల, ఇప్పుడు జీవితాంతం దెబ్బలు తినవలసి వస్తోంది అని వాపోయింది.

కష్టాలను ఓర్చుకున్నవాడే గొప్పవాడు అవుతాడు !!!!!

Thursday, October 31, 2013

అనగనగా ఒక నగ

        అనగనగా ఒక నగ
        అది మెరుస్తుంది ధగ ధగా
        వెల మండుతుంది భగ భగా
        వెలది చూస్తుంది మురిపెంగా
        పెంచుతుంది మగని పగ
        చిమ్ముతుంది అనుమానపు పొగ
        పెడుతుంది  కాపురంలో సెగ
        మారుస్తుంది (మగని) మనసు క్రూరంగా
        పట్టిస్తుంది (మగనితో) ఆలి సిగ      
        ఇదంతా చూసి, 'నగ' నవ్వుతోంది పక పకా 

Tuesday, May 28, 2013

కలికాలమున

నేరక  కోరితి గారముగ కూరను
భారముగ ఘోరముగ నిట్టూర్చి
కారమేసి కుంభమును దిద్దెన్ తీర్చి
వద్దన్న నోట మన్నే అని తిన్నా

కలికాలమున కమ్మటి కూర కరువాయె
నేలలాయే నాతి చేతిన నేతిని పోసి
కల్లలాయె కల, విల విల నేనిలా
ఎలాగోలా ఇలా తలమున బక్కబ్రతుకు

 

Tuesday, May 21, 2013

శిస్తు - కిస్తు

శిస్తు - కిస్తు
పడుతూ లేస్తూ
వెళుతూ వస్తు
చూస్తున్నా వాస్తు
దాంతో నా బతుకు
ఒక రోజు పస్తు
ఇంకో రోజు మస్తు
అయిన వేస్తోంది ఈ సర్కారు నా పై సేవ శిస్తు
అది కట్టడానికి నేను అడుగుతున్నా ఇంకో కిస్తు