Thursday, November 21, 2013

Money song ki Parody

చింద్రం నీ బ్రతుకే బ్రదరూ డబ్బును తెలివిగ వాడు గురు
ఇబ్బడి ముబ్బడి కోరికతో చత్తగ అవ్వకు నువ్విగురు 
బ్యాంకులొ దాచిన డబ్బులు చాలద ఇంట్లో సంగతి చూడోమారు
ఆలిని పిల్లని అల్లన తోసి సాదించేదేముంది గురూ
చింద్రం నీ బ్రతుకే బ్రదరూ డబ్బును తెలివిగ వాడు గురు
ఇబ్బడి ముబ్బడి కోరికతో చత్తగ అవ్వకు నువ్విగురు 

తిండికని వంటిల్లుండగ హోటలుకెలతారు 
నానా గడ్డికి డబ్బులు కట్టి మూలాన పడతారు  
బ్రాండుల కోసం బానిసలవుతూ నీరసపోతావు 
పక్కింటోడితొ పోటీ పడుతూ లేస్తూ వుంటావు  
చివరకి కరుసైపోతావు 

చింద్రం నీ బ్రతుకే బ్రదరూ డబ్బును తెలివిగ వాడు గురు
ఇబ్బడి ముబ్బడి కోరికతో చత్తగ అవ్వకు నువ్విగురు 

కారుకని బెంజెందుకురా హోండానే చాలు 
ఊరికనే పరుగెందుకురా గోరిగింది చాలు 
4s అయినా 5s అయినా మాటరు ఒకటేగా 
ఓ ఎస్సంటూ ముందుకుపోతే అంతా మంచెగా 
పెళ్ళాం పిల్లలు నీకేగా 
చింద్రం నీ బ్రతుకే బ్రదరూ డబ్బును తెలివిగ వాడు గురు
ఇబ్బడి ముబ్బడి కోరికతో చత్తగ అవ్వకు నువ్విగురు 


Tuesday, November 19, 2013

Telugu Chandassu - Kanda Padyam

తెలుగు గణాలు:
------------------
          ఇంద్ర గణాలు:  నల నగ సల భ ర త
                              నల  - I I I I 
                              నగ - I I I U 
                              సల - I I U I 
                              భ - U I I 
                              ర - U I U 
                              త - U U I 
         సూర్య గణాలు : గల  న 
                              గల - U I 
                              న  - I I I 

తెలుగు రీతులు :
-----------------
        ౧) కందం 
                        కంద  పద్యం  అందం  ఇంత  అంత  కాదు. అతి  సుందరమైన   పద్య  రీతులలో కందం  ఒకటి .  

              1. కంద  పద్యంలో  
                              "గగ"(UU), "భ" (U I I), "జ" (I U I), "స"(I I U), "నల" (I I I I)
                                             అనే  గణాలు  వస్తాయి  . గమనిస్తే  అన్ని  4 మాత్రలు  కల గణాలే!
               2. కందంలో  1,3 పాదాలలో  3 గణాలు, 2,4 పాదాలలో  5 గణాలు  వుంటాయి 
               3. బేసి  గణం  "జ" గణం  కారాదు.   
                             అంటే  1,3 పాదాలలో  1,3 గణాలు,  2,4 పాదాలలో  2,4 గణాలు "జ" గణం  కాకూడదు  
               4. 2,4 పాదాల అంతంలో  "గురువు" ఉండాలి .  అంటే  ఈ  పాదాలలో  5 వ  గణం  "గగ" లేదా  "స" అయి  ఉండాలి  
               5. ప్రాస  నియమం  పాటించాలి.  ప్రాసయతి  పనికి  రాదు 
               6. యతి  మైత్రి  2,4 పాదాలలో  మొదటి  అక్షరానికి , నాలుగో  గణం మొదటి  అక్షరంతో  కుదరాలి  
               7. అన్ని  పాదాలలో  మొదటి  అక్షరాలు  అన్ని  హ్రస్వాలు  గాని , అన్ని  దీర్ఘాలు గాని  అయి  ఉండాలి  
               8. 2,4 పాదాలలో  3 వ  గణం  "జ" కానీ  "నల" కానీ  అయి  ఉండాలి   

చూడటానికి  చాలా  # స్ట్రిక్ట్ # గ  అనిపించినా, కందంలోని  గణాలన్నీ  నాలుగు మాత్రల  గణాలు  కావటం  వలన  పద్యం  లయ  పట్టుకోవటం  కాల  తేలిక. 
ఒక  సారి  కంద  పద్యం  లయ   అలవడితే  పద్యాలూ  వాటంతట  అవే  ఈ  సూత్రాలకు అనుగుణంగానే  వస్తాయి. \
సుమతి  శతక  పద్యాలు  అన్ని  కంద  పద్యాలే. మీకు  వచ్చిన  పద్యాలనూ  నెమరు  వేస్తూ  లయ  బద్ధంగా  చదవటానికి   పైకి చదువుతూ  సాధన  చేస్తే  పద్యాలు  చదవటం , రాయటం , గుర్తుంచుకోవటం 
తేలిక  అవుతాయి ! 

Sunday, November 17, 2013

సమస్యా పూరణం

చరిత్ర సృష్టించ ఇంద్రుడు ఆంధ్రకు బోయెన్ 
గోడదూక ఈకలు పెంచే కొకలాగ ఆశించెన్ 
బుర్ర ఝల్లన బుడిపే లేచి తడిమి వెనుతిరగ బిత్తరన్   
అప్సరస మోముని జూచి ఇంద్రుడు మూర్చ బోయెన్ 

Sunday, November 10, 2013

Oka tamila pataki peradi

Saradaga mitrudu Bharadwaja meeda vesina visuru.


Pelli subhakamkshalu

Mitruni peli roju subhakankshalaki kanaka padda patlu.

మీ పెళ్లి రోజు e-జనాలకి భోజనాలు పెట్టకపోయినా ఖజానా కదలక మంచి బిస్కెట్టు వేసారు. మీ బిస్కట్టు మీద మనసెట్టక మీ పనిపట్టాలని రోడ్డున పడ్డాను. ఇది మీకోసం.

సాగితి త్రాగితి బొక్కెన స్టారు బుక్సు
మోసితి ఆ పడతి స్ట్రేంజ్ లుక్సు
మ్రోగించితి వాహనమున అరవ సాంగ్సు
పలకదాయే అంబ ఇవ్వదాయే ఆశిస్సు

కళ్యాణరామకి పెళ్లి రోజు శుభాసిస్సులు
చూద్దామన్నాకనపడవుగా మీమోమున కస్సు బుస్సులు
పెళ్ళంటే చెప్పడమే కదా ఎప్పుడూ ఎస్సులు
లేకపోయిన తప్పదు చివరికి తపస్సులు
ఎప్పుడూ ఉండండి హాట్ చాకోలేట్టులా
సరదాకోసం అప్పుడప్పుడు చీక్లేట్టులా

పట్టు విడవక జుట్టు ముడవక నడుము వంచాక
కలుక్కుమనె కీలు తళుక్కుమనే ఈ హుళక్కవితవిక
మీకోసం సరదాగా ఈ తవికల తలంటు
వూడగోట్టకండి ఈ ఫ్రెండు ఫిలమెంటు

Friday, November 8, 2013

Corporate Successful Stories...

ఒక శిల్పి రాజుగారి ఆస్థానంలో ఉద్యోగం సంపాదించేందుకు అడవి మార్గాన వెళ్ళసాగాడు . మద్యాహ్నము భోజన వేళ కావడంతో ఒక చెట్టు కింద ఆగి, భోజనం చేసి, విశ్రాంతి తీసుకొను చుండగా, అక్కడ నేల మీది పడివున్న రాళ్ళు కనిపించాయి. అవి చదరంగా, నున్నగా ఉండటంతో, ఆతని లోని కళాకారుడు మేల్కొని, వెంటనే మొదటి రాతిని మలచ సాగాడు. శిల్పి యొక్క ఉలి దెబ్బలు తట్టుకోలేక ఆ రాయి, అమ్మా అబ్బా అని అరవసాగింది. అది విన్న శిల్పి కొంచెం చిరాకు చెంది, మరల తన పని ప్రారంభించాడు. ఈ సారి, ఆ రాయి, ఇంకాస్త గట్టిగా అమ్మా అబ్బా అని అరవసాగింది. దాంతో చిరాకు వచ్చిన శిల్పి, ఈ రాయి కాదులే అని దానిని పక్కన పెట్టి, పక్కనే ఉన్న రాయిని తీసుకొని పని మొదలు పెట్టాడు.
ఈ రెండవ రాయి, తన పుట్టుక, కర్తవ్యం తెలిసినది కనుక, శిల్పి దెబ్బలు ఓర్చుకొని మౌనంగా ఉంది. ఒక గంటి సేపు పనిచేసిన తరువాత, ఆ శిల్పి తను చెక్కిన శిల్పం వైపు చూసి, తృప్తి చెంది, మంచి శిల్పం చెక్కానన్న ఆనందంతో మరల తన ప్రయాణం మొదలు పెట్టాడు.

ఆ తరవాత కొంత సేపటికి, ఆ త్రోవ లోనే వెళుతున్న కొంత మంది బాటసారులు, ఆ చెట్టు కింద సేద తీరుదామని, అక్కడ కూర్చున్నారు. ఇంతలో, ఒక బాటసారి, అక్కడ చెక్కి ఉన్న రాయిని చుసి, ఆహా, ఎవరో మహాశిల్పి ఇక్కడ చక్కని దేవుని విగ్రహం చెక్కాడు అని ఆనందంతో, చక్కగా ఉన్న ఆ శిల్పాన్ని, ఆ పక్కనే ఉంచి, దగ్గరలోనే ఉన్న చెరువు లో నుంచి నీళ్ళు తెచ్చి, శిల్పాన్ని కడిగి, చెట్టు పూలు ఆ శిల్పం కాళ్ళ దగ్గర ఉంచాడు. మరొకామె తన వద్ద నున్న పసుపు, కుంకుమ, ఆ శిల్పం మీద వేసి, పక్కనే ఉన్న మొదటి రాయిని, దేవుని విగ్రహం ముందుకు జరిపి, ఆ రాయి మీద కొబ్బరి కాయ కొట్టింది.

తరవాత కొద్ది రోజులకే, ఆ దేవుడి విగ్రహానికి పూజలు మొదలై, ఆ మొదటి రాయిని, శాశ్వతంగా, కొబ్బరి కాయలు కొట్టే దానికింద మార్చారు...

అప్పుడు మొదటి రాయి, ఆహా, ఒక గంట దెబ్బలకి ఓర్చుకుంటే, హాయిగా గుళ్ళో పూజలు అందుకునేదాన్ని, ఆ కష్టం పడలేక పోవడం వల్ల, ఇప్పుడు జీవితాంతం దెబ్బలు తినవలసి వస్తోంది అని వాపోయింది.

కష్టాలను ఓర్చుకున్నవాడే గొప్పవాడు అవుతాడు !!!!!

Thursday, October 31, 2013

అనగనగా ఒక నగ

        అనగనగా ఒక నగ
        అది మెరుస్తుంది ధగ ధగా
        వెల మండుతుంది భగ భగా
        వెలది చూస్తుంది మురిపెంగా
        పెంచుతుంది మగని పగ
        చిమ్ముతుంది అనుమానపు పొగ
        పెడుతుంది  కాపురంలో సెగ
        మారుస్తుంది (మగని) మనసు క్రూరంగా
        పట్టిస్తుంది (మగనితో) ఆలి సిగ      
        ఇదంతా చూసి, 'నగ' నవ్వుతోంది పక పకా 

Tuesday, May 28, 2013

కలికాలమున

నేరక  కోరితి గారముగ కూరను
భారముగ ఘోరముగ నిట్టూర్చి
కారమేసి కుంభమును దిద్దెన్ తీర్చి
వద్దన్న నోట మన్నే అని తిన్నా

కలికాలమున కమ్మటి కూర కరువాయె
నేలలాయే నాతి చేతిన నేతిని పోసి
కల్లలాయె కల, విల విల నేనిలా
ఎలాగోలా ఇలా తలమున బక్కబ్రతుకు

 

Tuesday, May 21, 2013

శిస్తు - కిస్తు

శిస్తు - కిస్తు
పడుతూ లేస్తూ
వెళుతూ వస్తు
చూస్తున్నా వాస్తు
దాంతో నా బతుకు
ఒక రోజు పస్తు
ఇంకో రోజు మస్తు
అయిన వేస్తోంది ఈ సర్కారు నా పై సేవ శిస్తు
అది కట్టడానికి నేను అడుగుతున్నా ఇంకో కిస్తు

Monday, May 20, 2013

తొక్క తొక్క

తొక్కని తక్కువ చేసి చూచినన్
మొక్కులు మొక్కినా పోని పాపం దక్కున్
కిక్కురు మనక కనక మాట విను వినయంబుగన్
గుర్తున్న క్విక్ గన్ మురుగన్, లేకున్న నెత్తురు మరుగున్

బిర్రుగ తిన్న బ్రహ్మ తూగుతు కాయను చేసెన్
జగమున వదలక జాగు సేయ, బిగువాయన్ ఉపరితలం
చప్పున తప్పు తెలుసుకొని పేరు పెట్టేను తొక్క అనిన్
అలుసత్వమున కాయకు తొక్క అయినా మానవ జాతికి మక్కువాయెన్
ఎంత వాయ అన్నా వాయు వేగమున దూరును ఉదర భాగమున
 



Wednesday, May 15, 2013

ఇగురు - చిగురు

ఇగురు - చిగురు

మా ఇంట్లో వండారు ఇంత  ఇగురు

దాని పేరు చింత చిగురు

దాని రుచి చూస్తే అది కాస్త వగరు

అందుకే దాన్లో కలిపారు కాస్త షుగరు

అది తిన్న వాళ్లకి పెరుగు వంట్లో పొగరు

Sunday, May 5, 2013

ఓహ్ సౌందర్య

ఓహ్ సౌందర్య

నీ సొగసు సౌందర్యం
నీ మనసు మాధుర్యం
నీ మాటల్లో చాతుర్యం
నీ నాట్యంలో ఆహార్యం
ఏమీటి నన్ను ఆకట్టుకోవడంలో  నీ ఆంతర్యం
కాని నీకు ఎదురుగ నిలిచేందుకు లేదు నాకు ధైర్యం

Saturday, May 4, 2013

ఓహ్ శైలు

ఓహ్ శైలు

నిన్ను చూడాలంటే ఎక్కాలి నేను రైలు

నీ మనసొక మైలు

నీ మమతొక నైలు

ఇంతకీ కదిలిందా ముందుకు నా ఫైలూ

Friday, April 19, 2013

గేయ పాడింది గేయం

గేయ పాడింది గేయం
దానితో అయింది నా హృదయం గాయం
ఎవరో చేయాలి నాకు సాయం
ఎవరు చేస్తారు ఈ గేయ చేసిన గాయం మాయం
(ఈ తవిక చదివిన వారికి మతి భ్రమించటం ఖాయం)

Sunday, March 3, 2013

ఆమె పాట:



వేటూరి వారి  పదమై,
తేట తెలుగు కందమై,
తుంబుర నాదమై,
నటరాజ పాదమై, 
                  తియ్యని మకరందమై,                  
మలయ మారుత గంధమై, 
వీనులకు మోదమై,
యువతకు ప్రేమబంధమై,
సభికుల  ఆమోదమై,
అభిమానులకు ఆనందమైన నీ పాట, 
ప్రతి పూట, వినిపించును ప్రతి నోట  
 తీర్చును అలసట

Saturday, March 2, 2013

హోటలు


మొదలెట్టాను నేనొక హోటలు
అందు తిన్న విన్న వాళ్లకి కరువు మాటలు
ఇందు విందుకు అవసరం లేదు మూటలు
అన్ని పదార్ధాల మీద వుంటై మూతలు

మీ మేను జలదరించు క్షమించు, పులకరించు మెనూ విను
ఇదిగిదిగో, అల్లదిగో ఆ తెల్లగా వున్నది నా మనసు కాదు, వెన్న పూసిన deadly ఇడ్లీ
ఇదిగిదిగో ఇలా నున్నగ ముడుచుకనున్నది నేననుకున్నవా..? ఆశే.. కాదు అది దోసె
ఆ ప్రక్క చిప్పన ముక్కలై దిక్కులు చూస్తున్నది అప్పడం
ఆ గడప ప్రక్క బిక్క మొహంతో మిదిగుడ్లేసుకొని నీ దవడ కోసం చూసేది వడ

నీ బుడిబుడి అడుగులు చూసా, వచ్చిన వారి కడుపున గడబిడ చూసా
వచ్చిన వారు చూసి మేసి పక్కవాళ్ళని కేకేసి 
వాళ్ళు గోడ దూకేసి జుట్టు పీకేసి గంతేసి చిందేసి 
ఇప్పుడు ఆ ఫైవ్ స్టార్ హోటల్ వాడికి నిన్ను కట్ట బెట్టాలంటే 
నా కంట వెంట వెంటనే వచ్చే కన్నీరు 
కావాలా , జస్ట్ పది పైసలే తేనీరు 

Saturday, February 16, 2013

ఏ ఊతం లేని నా జీవితంలో


 ఏ ఊతం లేని నా జీవితంలో,  
 జీతం  బత్తెం కొరతైన రోజుల్లో, 
 తెగిన పతంగమై, తీరు తెన్నూలేక,  
  బరితెగించిన దున్నపోతులా, 
అచ్చోసిన ఆంబోతులా, 
 బస్తి అంతా గస్తీ తిరిగే రోజుల్లో,
 ఓ  ఇంతి, ముద్దులొలికే ముద్దబంతి, 
 అరుదెంచి నాలో నిక్షిప్తమైన నిద్రాణమైన ప్రతిభను గురుతెరింగి 
 మాటా మంతీ కలిపి, ఆప్యాయత కలబోసి, 
  తీయటి పల్కుల  విద్యుల్లతలను నాపై  (తనువంతా)  ప్రసరింపచేస్తూ , 
 ఉమ్మెత్త పువ్వుకి తావి ని అతికించి 
  చితికిన డెందము ను మరమ్మతు చేసి, 
  నాకు జీవితేచ్ఛ కలిగించి దిగంతాలకు పోయిన 
  ఆ అమృతమూర్తి కిదే నా ఆవేదనతో కూడిన నివేదన 

Thursday, February 14, 2013

ప్రేమంటే ?


ప్రేమంటే తెలుసా నీకు ? ప్రేమంటే తెలుసా మీకు?
ప్రేమ ఒక విప్లవం ప్రేమ ఎరుపు ప్రేమ మరుపు ప్రేమ మెరుపు 
ప్రేమ ఒక వెర్రి ప్రేమ ఒక స్ట్రాబెర్రి ముదిరిన కోడి కూర కర్రి
పులిహరలో కలిపిన పెరుగు, ఆలోచిస్తే ఆకలి తరుగు

అందని ద్రాక్ష పుల్లన
కోడి వేషం వేసాడు మల్లన్న
పులిసిన పిండి కమ్మన
మెల్లగా మాగిన ప్రేమ వర్దిల్లు చల్లన

పైత్యం విత్తు వేస్తె మొలకెత్తిన పిత్తపరిగ పరుగెత్తాలని ఎప్పుడూ చింతిస్తూనే వుంటుంది
ముందరేల్లె ప్రతి నత్తని లాగుతా వుంటుంది
చీకట్లో పొందలేని కలలు కంటుంది
సంవత్సరానికి ఒకసారి వేలేత్తుతానే వుంటుంది

Monday, January 21, 2013

నీ కవిత్వం అర్థంకాని తురకం


నీ కవిత్వం అర్థంకాని తురకం

తెలుగు కవిత్వానికి అది ఒక మరకం

అది విన్నవాడికి పుడుతుంది కడుపులో వికారం

చివరకు చేరతాడు వాడు నరకం

Friday, January 18, 2013

యుగాంతం



యుగాంతం ముందు గుణింతాలు చెప్పమని కుప్పిగంతులు వేస్తున్న ఓ ఇంతీ

చామంతి పూబంతి కాదు...

చూడు చూడు బయట చూడు తిరుగుతున్న తలనిచూడు

చూరు లేని పేదవాడు తిండి లేని బక్కవాడు

వాడ వాడ వున్న పీడ, కనపడలేదా నీకు నీ నీడ


ధమరుకం లో వత్తు తీసి అయ్యే ఒక మర్కటం

టం ట టం టం తొం తక ధిమి తొం

అక్షరాలకి వత్తులేందుకు గమ్మత్తుగా!!

దిగనంత వరకు తాగు మత్తు మత్తుగా

వుందిగా ప్రక్కన బెల్టు షాపు గుత్తంగా, ఇది ప్రభుత్వం చిత్తం గా !

అక్షరానికి వత్తులు తీసెయ్యి, నల్లాలకి మూతలు వేసేయ్యి

క్షణం క్షణం తీక్షణం నిరీక్షణం పరీక్షణం సమర్పణం

Thursday, January 17, 2013

క్రీం






పిల్లి తోలు తీసి ప్రతి రోజు వుతికినా
తీపి పులుపు కాదు తెలుపు నలుపు కాదు
నలుపు నల్లగా వుండదు తెలుపు తెల్లగా వుండదు
మెత్తటి గుండ్రాయితో నెత్తిన మోదిన రోజు
తెలుస్తుంది నలుపు తెలుపు ఒకటేనని వదిలాక తలలో బూజు
కలగా పులగం చేసి మా బుర్ర లో గుజ్జు తీసి
మసిపూసి మయసేసి గుండు గీసి గిరి గీసి
అలసి సొలసి తొలిచి తొలిచి మనసు కలచి
నేను నీ కలలో కనపడే బూచి విశూచి క్రీం
హిం ధాం ద్రుం బ్రిం కభం జగదం కచింబా....


ఓహ్ కనకం

ఓహ్ కనకం

నీవే నాకు ఇన్స్పిరేషన్

ఇక లేదు నా కవితా ఝరి కి రేషన్

వేసుకో నీ ఖతా లో ఓహ్ ప్రమోషన్

విన్నవారందరూ అవుతారు ఎమోషన్

కవితలోకానికి ఇది ఒక సెన్సెషన్

ఇక లేదు నా కవితా ప్రవాహానికి సెసేషన్

Wednesday, January 16, 2013

వచ్చింది వచ్చింది సంక్రాంతి

వచ్చింది వచ్చింది సంక్రాంతి
తెచ్చింది తెచ్చింది కోటి దీపాల కాంతి

ఇది రైతుల పండుగ
ఇది నూరిపిళ్ళ పండుగ
ఇది బావ మరదళ్ల పండుగ
ఇది బసవన్నల పండుగ
ఇది కోడి పందాల పండుగ
ఇది కొత్త అల్లుళ్ళ పండుగ

వచ్చింది వచ్చింది సంక్రాంతి
తెచ్చింది తెచ్చింది కోటి దీపాల కాంతి

ఇంటింట రంగవల్లులు

ఇంటింట రంగవల్లులు
ఉరూరా గంగిరెద్దులు
హరిదాసుల పాటలు
చిన్నపిల్లల ఆటలు

వచ్చింది వచ్చింది సంక్రాంతి

వచ్చింది వచ్చింది సంక్రాంతి
 తెచ్చింది తెచ్చింది కోటి దీపాల కాంతి
ఇది రైతుల పండుగ
పంటలతో గాదెలు నిండుగ
బసవన్నల అరుపులతో మెండుగా
వచ్చింది సంక్రాంతి కన్నుల పండువగా

Tuesday, January 15, 2013

భోగి పండగ రోజు

భోగి పండగ రోజు పాతవన్నీ తగలేసి
సంక్రాంతి కి కొత్త కొత్త ముగ్గులేసి
హరిదాసులకు దోసిళ్ళతో ధాన్యం పోసి
గంగిరెద్దుల ఆటలకి పిల్లలు డాన్సు చేసి
కొత్త అల్లుళ్ళు సరికొత్త పంచెలేసి
బావ సరసానికి మరదలి బుగ్గ సిగ్గులేసి
కనుమకి కోళ్ళతో పందేమేసి
బూరెలూ, పిండి వంటలు మేక్కేసి,
భార్య తో మంచ మెక్కేసే
సగటు జీవికి సంజీవని ఎందుకు దండగ
ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగ వుండగా

దీపావళి

భగ భగ ధగ ధగ లాడెను దీపావళి 
దడ దడ గడ బిడ ఉరికేను నా సిరా పాళి
నాసిరకపు సిరా కాదు కాదు, ఇది అయినది పదునైనది 
పసందైనది మీ గోడమీది పిడకైనది

వదలలేను నే నా సిరా, శ్రీ, కారం, సురేకారం కలిపి 

నే చేసిన ఆకారం నా కవితా ప్రకారం
కొట్టలేరు తట్టలేరు కదల లేరు వదల లేరు
నా మదిన మెదలిన భావం వదలాలనుకోడమే నా బలం, బలహీనత

గొంతున గుంపుగనున్న ఆ గంతులేమాయే

హరివిల్లున వంపుతగ్గినట్టు చోద్యమాయే
ఇది ఖచ్చితంగా ఆ శ్రీనివాసుడి మాయే
త్వరగా వూపిరితీయకపోతే నేను పాయే!

Sunday, January 13, 2013

వచ్చింది వచ్చింది సంక్రాంతి

వచ్చింది వచ్చింది సంక్రాంతి
తెచ్చింది తెచ్చింది కోటి దీపాల కాంతి
పెంపొందాలి పాడి పంటల విక్రాంతి
వేల్లివిరియాలి ప్రతి తెలుగింట సుఖ శాంతి

అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు

దేవరకొండ సుబ్రహ్మణ్య (దేసు)

సిరిసంపదలతో - సంక్రాంతి


         ప్రపంచం లోని తెలుగు మిత్రులందరూ,
  భోగ భాగ్యాలతో - భోగి 
  సిరిసంపదలతో - సంక్రాంతి 
  కన్నుల పండుగుగా - కనుమ
జరుపు కోవాలని కోరుకుంటూ

మీ  
-- నాగరాజు 

Saturday, January 12, 2013

ఓ ఐస్ క్రీమూ !

ఓ ఐస్ క్రీమూ ! నువ్వంటే నాకు చాలా లవ్వు

 తినడానికీ పరుగుపెదత రివ్వు రివ్వు

 తిన్నాక నా పళ్ళు ఇక జివ్వు జివ్వు

 అతిగా తిన్నాక నాకు పెరుగుతుంది ఒంట్లో కొవ్వు

 అది విన్న  మా ఆవిడా పెడుతుంది ఒక పెద్ద కేక కెవ్వు

 ఎందుకే  నన్నింత ఊరిస్తావు నువ్వు?

Friday, January 11, 2013

O Narahari

ఓ నరహరి
నువ్వుండేది యాదగిరి
ఓ నరహరి
నువ్వుండేది యాదగిరి

తెలంగాణా మీద ఏందీ కిరి కిరి
మా నేతల కొట్లాటలు సరే సరి

నువ్వే రావాలే ఈ పంచాయతి తీర్చ  మరి

ముందు మాట

ముందు మాట 

     నేను నా స్నేహితులు ప్రాస కోసం పాకులాడుతూ చేసే పిచ్చి ప్రయోగాలని కవిత అనాలో, లేక తవిక అనాలో తెలియక, ఉన్న రెండు వెంట్రుకలను పీక్కుంటూ ఉండగా... 
     మా గురువు గారు జంధ్యాల గారు గుర్తుకు వచ్చి... (నేను ఆయనకీ ఏకలవ్య శిష్యుడిని లెండి )...  వెంటనే నా బ్లాగ్ పేరు కవితవిక గా నిర్ణయించి, ఈ కితకితల మహాయజ్ఞానికి  శ్రీకారం చుట్టాను... 

     ఇందులో  మీ భాషా పరిజ్ఞానాన్ని పరీక్షించు కోవచ్చు... మీ చేతుల కున్న దురద తీర్చుకోవచ్చు , అలాగే, మీ శత్రువుల మీద పగ (భౌతికంగా కాదు లెండి) తీర్చుకోవచ్చు (మీ తవికలు వినిపించి, అంకితమిచ్చి) 

     సునిశిత  హాస్యాన్ని అందించే అందరి రచయితలకి ఇదే నా ఆహ్వానం 

భవదీయుడు 
-- నాగరాజు