ఏ ఊతం లేని నా జీవితంలో,
జీతం బత్తెం కొరతైన రోజుల్లో,
తెగిన పతంగమై, తీరు తెన్నూలేక,
బరితెగించిన దున్నపోతులా,
అచ్చోసిన ఆంబోతులా,
బస్తి అంతా గస్తీ తిరిగే రోజుల్లో,
ఓ ఇంతి, ముద్దులొలికే ముద్దబంతి,
అరుదెంచి నాలో నిక్షిప్తమైన నిద్రాణమైన ప్రతిభను గురుతెరింగి
మాటా మంతీ కలిపి, ఆప్యాయత కలబోసి,
తీయటి పల్కుల విద్యుల్లతలను నాపై (తనువంతా) ప్రసరింపచేస్తూ ,
ఉమ్మెత్త పువ్వుకి తావి ని అతికించి
చితికిన డెందము ను మరమ్మతు చేసి,
నాకు జీవితేచ్ఛ కలిగించి దిగంతాలకు పోయిన
ఆ అమృతమూర్తి కిదే నా ఆవేదనతో కూడిన నివేదన